తెలంగాణ

telangana

ETV Bharat / state

అధిగమించబోయి... అనంతలోకాలకు - SIDDIPET

అతివేగం ప్రమాదకరం అని తెలిసినా యువత మారడం లేదు. మితిమీరిన వేగంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ముందు వెళ్తున్న వాహనాలను అధిగమించే క్రమంలో ప్రమాదాలకు గురై, ప్రాణాలు కోల్పోతున్నారు.

అధిగమించబోయి...అనంతలోకాలకు...

By

Published : Jun 30, 2019, 2:50 PM IST

చిన్నకోడూరు మండలం చౌడారంలో ట్రాక్టరును అధిగమించే క్రమంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కాగా ట్రాక్టరు, ద్విచక్ర వాహనం నడిపించిన ఇద్దరూ మృతుడికి వరుసకు అన్నయ్యలు కావడం గమనార్హం. చౌడారం గ్రామానికి చెందిన గొల్లెన అరవింద్‌ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం గ్రామంలోని పొలం వద్దకు వెళ్లిన అరవింద్‌ వరుసకు సోదరుడయ్యే అనిల్‌ ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరుగుముఖం పట్టాడు.

ఇదే సమయంలో వారికి ముందుగా అరవింద్‌కు మరో సోదరుడైన మధు ట్రాక్టరు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో అనిల్‌ ట్రాక్టరును అధిగమించబోయాడు. ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో బాలుడు కిందపడిపోగా, అతడి మీదుగా ట్రాక్టరు వెళ్లింది. తీవ్ర గాయాలైన బాలుడిని సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించే క్రమంలో మృతి చెందాడు. అనిల్‌ స్వల్పంగా గాయపడ్డాడు.

ఈ ఘటనలో మృతి చెందిన అరవింద్‌కు అనిల్‌, మధులు వరుసకు సోదరులు. బాలుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వివరించారు. మరోవైపు బాలుడి దుర్మరణంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చూడండి:నిలిచిన సంగీత ఉత్సవం... ఆగ్రహించిన ప్రేక్షకులు

ABOUT THE AUTHOR

...view details