మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలో గాంధారి మైసమ్మ ఆలయంలో బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు 108 బోనాలతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి దంపతులు ఆలయాన్ని సందర్శించారు. వేకువ జాము నుంచి సుమారు 80 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.
మైసమ్మను దర్శించుకున్న జడ్పీఛైర్‌పర్సన్ దంపతులు - MANCHERIAL
మంచిర్యాల జిల్లా బొక్కలగుట్టలో గాంధారి మైసమ్మను జడ్పీ ఛైర్పర్సన్ దంపతులు దర్శించుకున్నారు. డప్పు చప్పుళ్ల నడుమ బోనాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
మైసమ్మను దర్శించుకున్న జడ్పీఛైర్‌పర్సన్ దంపతులు