హైకోర్టు తీర్పుకు అనుకూలంగా తమ నియామకం చేపట్టాలని విద్యా వాలంటీర్లు మంచిర్యాల జిల్లా విద్యాధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా విద్యా వాలంటీర్లు సేవలందిస్తున్నారని తెలిపారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల కోసం తాము అహర్నిశలు కృషి చేశారని స్పష్టం చేశారు.
'విద్యావాలంటీర్ల నియామకాలు చేపట్టాలి' - HIGH COURT DECISION
తమ నియామాకాన్ని చేపట్టాలంటూ విద్యావాలంటీర్లు మంచిర్యాల జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసింది. వెంటనే తమకు నియామక పత్రాలు అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
జిల్లా విద్యాశాఖాధికారికి వినతి పత్రం అందజేత
ఇప్పటికైనా హైకోర్టు తీర్పుకు అనుకూలంగా ప్రభుత్వం గత విద్యా సంవత్సరంలో విధులు నిర్వహించిన విద్యావాలంటీర్ల నియామకం చేపట్టాలని ఆ సంఘం నేతలు అధికారులను కోరారు. అనంతరం మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి ఎం ఏ.రషీద్‌కు వినతి పత్రాన్ని అందించారు.
ఇవీ చూడండి : 'కేంద్రమంత్రి అయినా నేనెప్పటికి భాజపా కార్యకర్తనే'