మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని అమరులైన సింగరేణి కార్మికుల విగ్రహాలకు.. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పాలాభిషేకం చేసి జోహార్లు తెలిపింది. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుంగ్, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్.. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను నాయకులు తీవ్రంగా ఖండించారు.
'ప్రభుత్వం... సింగరేణి కార్మికుల కోసం కృషి చేసింది' - తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిందని టీజీబీకే ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. భాజపా నాయకులు.. అమరులైన కార్మికుల విగ్రహాలకు వేసిన పూలమాలలతో, అపవిత్రం జరిగిందంటూ మంచిర్యాలలోని కార్మికుల విగ్రహాలను పాలతో శుద్ధి చేశారు.
'తెరాస ప్రభుత్వం సింగరేణి కార్మికుల కోసం కృషి చేసింది'
తెరాస ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిందని టీజీబీకే ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. భాజపా నాయకులు.. అమరులైన కార్మికుల విగ్రహాలకు వేసిన పూలమాలలతో.. అపవిత్రం జరిగిందని భావిస్తూ పాలతో శుద్ధి చేశామన్నారు. రైల్వే, ఎల్ఐసీ సంస్థలతో పాటు బొగ్గు పరిశ్రమలను కూడా ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తే.. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇదీ చదవండి:మంత్రి కేటీఆర్ వ్యవహార శైలి చూస్తే నవ్వొస్తుంది: దాసోజు