మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన శ్రీనివాస్ బతుకుదెరువు కోసం గతేడాది ఆగస్టులో దుబాయ్ వెళ్లాడు. అతనికి భార్య సుజాత, ఇద్దరు కుమార్తెలు కావ్య, వైష్ణవి ఉన్నారు. సుజాతకు వరసకు బావ అయిన కొమురయ్య మనవడి బారసాల శుభకార్యం ఉండగా... 3 రోజుల కిందట ఆమె కుమార్తెలతో కలిసి బెల్లంపల్లికి వెళ్లారు.
దుబాయ్ నుంచి రాలేక... కడసారి చూపు దక్కించుకోలేక
కరోనా కాలంలో రోడ్డు ప్రమాదానికి గురై భార్య, కుమార్తె చనిపోయినా వారిని కడచూపును సైతం నోచుకోలేకపోయాడు ఓ వ్యక్తి. బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన అతనికి కుటుంబ సభ్యులను కడసారి చూపు కూడా దక్కకుండా చేసింది ఈ మహమ్మారి. అక్కడినుంచి రాలేక.. బాధను దిగమింగలేక... వాట్సప్ వీడియోకాల్ ద్వారానే వారి అంత్యక్రియలు చూస్తూ రోదించిన ఘటన మందమర్రిలో చోటు చేసుకుంది.
ప్రజారవాణా లేకపోవడంతో వైష్ణవిని బెల్లంపల్లిలోనే ఉంచి మిగతా ఇద్దరిని దిగబెట్టేందుకు కొమురయ్య నిన్న తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై బయల్దేరారు. మందమర్రిలో రాష్ట్ర రహదారిపై కేకే ఓసీ ప్రాంతానికి చేరుకోగానే వారి వాహనాన్ని ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాస్ దుబాయ్ నుంచి రాలేని పరిస్థితులతో తల్లి, సోదరికి వైష్ణవి అంత్యక్రియలు నిర్వహించింది. సుజాత భర్త వీడియోకాల్ ద్వారా అంత్యక్రియలను వీక్షిస్తూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.