తెలంగాణ

telangana

ETV Bharat / state

'వాహనాదారులకు పూలు ఇచ్చి... మరీ చెప్పారు'

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహన చోదకులకు పూలు ఇచ్చి.. హెల్మెట్లు ధరించాలని, రహదారి నిబంధనలు పాటించాలి కోరారు.

traffic awareness in manchiryala
'వాహనాదారులకు పూలు ఇచ్చి... మరి చెప్పారు'

By

Published : Jan 29, 2020, 4:38 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని రెండవ పట్టణ పీఎస్​ పరిధిలో పోలీసులు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా వాహన చోదకులకు ట్రాఫిక్​పై అవగాహన కల్పించారు. రైల్వే పైవంతెన వద్ద విద్యార్థులు, పోలీసులు వాహన చోదకులకు పూలు ఇచ్చి హెల్మెట్లు ధరించాలని, రహదారి నిబంధనలు పాటించాలని కోరారు.

ప్రయాణికులంతా రోడ్డు నిబంధనలు పాటించాలని సీఐ జగదీష్ చెప్పారు. నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు అవకాశం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండో పట్టణ ఎస్సై భాస్కర్ రావు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

'వాహనాదారులకు పూలు ఇచ్చి... మరీ చెప్పారు'ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్

ఇదీ చూడండి:'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details