గ్రామాభివృద్ధికోసమే ముఖ్యమంత్రి 30రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రవేశపెట్టారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ప్రజల ఆరోగ్యం, పల్లె ప్రగతే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. రాష్టంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లాకు 45 ట్రాక్టర్లను మొదటి విడతలోనే పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. మంచిర్యాల కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బోర్ల కుంట వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ హోళీకేరీ, ఎమ్మెల్యే దివాకర్ రావు, జడ్పీ ఛైర్పర్సన్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలో 45 ట్రాక్టర్ల పంపిణీ
గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లాకు మంజూరు చేసిన 45 ట్రాక్టర్లను కలెక్టరేట్ ప్రాంగణంలో పంపిణీ చేశారు.
మంచిర్యాలలో ట్రాక్టర్ల పంపిణీ