రైతుబంధు నిధులు బ్యాంకు ఖాతాలో జమ కావటం పట్ల మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల రైతులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. వానాకాలం పంట పెట్టుబడి కోసం.. ప్రభుత్వం రూ. 7 వేల 400 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
రైతుబంధు నిధుల విడుదల పట్ల రైతుల హర్షం - రైతుబంధు నిధుల విడుదల
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలో.. ఎమ్మెల్యే దివాకర్‌రావు స్థానిక రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఖాతాల్లో జమ అయిన రైతుబంధు సాయంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో వ్యవసాయానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే వివరించారు.
farmers on kcr
తెరాస ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో వ్యవసాయానికి పెద్దపీట వేసిందన్నారు ఎమ్మెల్యే. రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టులను నిర్మించి.. రాష్ట్రాన్ని పచ్చని పొలాలతో సస్యశ్యామలం చేసిందని అన్నారు. సీఎం కేసీఆర్ పథకాల పట్ల రైతులు ఆనందంగా ఉన్నారని వివరించారు.
ఇదీ చదవండి:వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయం విడుదల చేసిన ఏపీ సీఎం