ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మోకరిల్లి రైతు ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో పొలం బాట-పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు.. రైతులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో అన్నదాతలు, స్వయం సహాయక సంఘం సభ్యుల సమస్యలను నేతలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను తొలుత వ్యతిరేకించిన సీఎం కేసీఆర్, దిల్లీ వెళ్లి వచ్చిన తరువాత సమర్థిస్తున్నట్లు ప్రకటించడం ఒప్పందంలో భాగమేనని భట్టివిక్రమార్క దుయ్యబట్టారు.
రైతు చట్టాల రద్దు అంశాన్ని శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. పొలం బాట- పోరుబాట ఈ నెల 24 వరకు రాష్ట్రంలో పర్యటిస్తున్నదని భట్టి తెలిపారు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని రెండు కోట్ల మంది రైతుల సంతకాలతో.. తమ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రపతిని కలిశారని తెలిపారు.
ఓట్లను చీల్చే ప్రయత్నాలు..