మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. సింగరేణి విభాగాలతో పాటు బ్యాంకులు, ఎల్ఐసి సంస్థలు తెరుచుకోలేదు. కార్మిక సంఘాల నాయకులు కార్యాలయాల వద్దకు చేరుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక చట్టాలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంలో సీఐటీయూ కేంద్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నాగరాజు గోపాల్, ఏఐటీయూసూ నాయకులు చిప్ప నర్సయ్య, ఇఫ్టూ నాయకులు చాంద్ పాషా పాల్గొన్నారు.
విజయవంతంగా కొనసాగుతున్న భారత్ బంద్
భారత్ బంద్‌లో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కార్మిక సంఘాల నాయకులు ధర్నాలు చేశారు.
విజయవంతంగా కొనసాగుతున్న భారత్ బంద్