మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పది కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా నోడల్ అధికారి డాక్టర్ బాలాజీ తెలిపారు. మొత్తం 14 మంది నుంచి నమూనాలు సేకరించి వైరస్ నిర్ధరణ పరీక్షల నిమిత్తం పంపగా... వారిలో పది మందికి పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు.
' 14 మందికి కరోనా పరీక్షలు చేస్తే.. పదిమందికి పాజిటివ్' - మంచిర్యాలలో కరోనా కేసులు
మంచిర్యాలలో కరోనా విజృంభిస్తోంది. వైరస్ లక్షణాలతో బాధపడుతున్న 14 మంది నమూనాలు సేకరించి... పరీక్షించగా వారిలో పది మందికి వైరస్ సోకినట్లు గుర్తించామని జిల్లా నోడల్ అధికారి డాక్టర్ బాలాజీ పేర్కొన్నారు.
14 నమూనాల్లో... పది మందికి కరోనా పాజిటివ్
మంచిర్యాలలో ముగ్గురు, నస్పూర్‌లో ఇద్దరు, మందమర్రిలో ఇద్దరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురికి వైరస్ సోకినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి:ప్రయాణిస్తుండగా చెలరేగిన మంటలు... ఆహుతైన స్కోడాకారు