మంచిర్యాల జిల్లా భీమిని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో సువర్ణ స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆన్లైన్ తరగతులపై వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. ఆటోలో తిరుగుతూ మైక్‌లో ఆన్లైన్ తరగతులపై ప్రచారం చేస్తున్నారు.
ఆన్లైన్ తరగతులపై ఉపాధ్యాయురాలి వినూత్న ప్రచారం - మంచిర్యాల జిల్లా వార్తలు
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వినేలా చూడాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మంచిర్యాల జిల్లా భీమినిలో ఓ ఉపాధ్యాయురాలు ఆన్లైన్ పాఠాలపై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.
మైక్‌తో ఆన్లైన్ తరగతులపై ఉపాధ్యాయురాలి వినూత్న ప్రచారం
తల్లిదండ్రులను పరిమిత సంఖ్యలో సమావేశపరిచి నిబంధనలు పాటిస్తూ టీ శాట్, దూరదర్శన్‌లో పాఠాలు వినేలా చూడాలని ఆమె కోరారు. ఈ ప్రచారంతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో అవగాహన పెరిగింది. పాఠశాలలోి మొత్తం 239 మంది విద్యార్థులు ఉండగా.. 200 మందికి పైగా విద్యార్థులు పాఠాలు వింటున్నారు.
ఇదీ చదవండి:రెవెన్యూ శాఖలో కొత్త పోస్టులు... కసరత్తు ప్రారంభించిన అధికారులు...