ప్రభుత్వ భూములను అప్పగించాలి... లేదంటే చర్యలు - bellampalli
భూ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో ఈ నెల 19 నుంచి ప్రభుత్వ భూములను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సబ్‌కలెక్టర్ తెలిపారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను అప్పగించాలని సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. పట్టణంలో 700 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఖాళీ స్థలాలను నకిలీ ధ్రువ పత్రాలతో కబ్జాదార్లు ఇష్టానుసారంగా ఆక్రమణ చేశారన్నారు. వారిపై క్రిమినల్, పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామని రాహుల్ రాజ్ హెచ్చరించారు. ఈ నెల 19నుంచి బెల్లంపల్లిలో ప్రభుత్వ భూముల గుర్తింపును ప్రత్యేక బృందాలు సర్వే చేస్తాయని వెల్లడించారు. అప్పటిలోగా భూములను అప్పగించాలని సూచించారు.