వేతనంలో 50 శాతం కోత విధించడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లోని ఉపరితల గనుల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వీరికి కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.
సింగరేణి కార్మికులు విధుల బహిష్కరణ - వేతనాల్లో 50శాతం కోత
మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ఉపరితల గనుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు విధులు బహిష్కరించారు. వేతనాల్లో 50శాతం కోత విధించడాన్ని నిరసస్తూ ఆందోళన చేశారు.
సింగరేణి కార్మికులు విధుల బహిష్కరణ
కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికులకు అదనంగా వేతనాలు చెల్లించాల్సింది పోయి ఉన్న వేతనంలో కోత విధించాడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కోత విధించిన డబ్బును తిరిగి చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
ఇవీచూడండి:ఒగ్గుకథ రూపంలో కరోనా అవగాహన