మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు మధ్యాహ్న భోజన సమయంలో ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు పడుతున్న సమస్యలపై అన్ని సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాటం చేస్తున్నామని కార్మిక నాయకులు తెలిపారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని 2017 ఏప్రిల్ వేతన సవరణ అమలు చేయాలని, డీజిల్ పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. వెంటనే అద్దె బస్సులను రద్దు చేసి కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా - ఆర్టీసీ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు కార్మికులు మధ్యాహ్న భోజన సమయంలో ఆందోళనకి దిగారు.
ఆర్టీసీ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా