ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రాదేశిక పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌కు ఏసీపీ బాలుజాదవ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
అయితే పోలింగ్ కేంద్రాల వద్ద తాగు నీరు ఏర్పాటు చేయకపోవడం వల్ల సిబ్బంది అవస్థలు పడుతున్నారు. బెల్లంపల్లి మండలం ఇంద్రనగర్ లో గుంపులుగా ఉన్న ప్రజలను పోలీసులు చెదరగొట్టారు. నియోజకవర్గంలో 47 ఎంపీటీసీ స్థానాలకు 166 మంది, 7 జడ్పీటీసీ స్థానాలకు 27 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ - కొనసాగుతున్న పోలింగ్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రాదేశిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
ఇవీ చూడండి: 'ఆలస్యమైనా అనుమానాలకు తావుండదు'