రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి శుక్రవారం రామగుండం సీపీ సత్యనారాయణ కౌన్సిలింగ్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి రామగుండం సీపీ సత్యనారాయణ హాజరయ్యారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏఎస్ఐ వరకు పనిచేస్తున్న వారికి కౌన్సిలింగ్ చేశారు. తొమ్మిది మంది హెడ్ కానిస్టేబుళ్లు, 59 కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. పారదర్శకత కోసమే ఇలాంటి కార్యక్రమాలు అమలు చేశామని కమిషనర్ తెలిపారు.
పోలీసులకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీపీ - పోలీసులకు
మంచిర్యాల జిల్లాలో పోలీసు సిబ్బందికి రామగుండం సీపీ సత్యనారాయణ కౌన్సిలింగ్ చేపట్టారు.
పోలీసులకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీపీ