కరోనా వ్యాధి నిర్మూలన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రిలో పోలీసులు విస్త్రృత తనిఖీలు చేపట్టారు. మందమర్రి మండలం కోటేశ్వర్ రావు పల్లి రాష్ట్రీయ రహదారిపై పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అత్యవసర పని వారిని మినహాయించి మిగతా ప్రయాణికులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అత్యవసర సేవలు మినహా మిగతా వారెవరూ బయటకు రావొద్దని వాహనదారులకు రహమాన్ సూచించారు.
మందమర్రిలో పోలీసుల విస్త్రృత తనిఖీలు - POLICE CHECKINGS IN MANDAMARRI
మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతావారెవరూ బయటకు రాకూడదని బెల్లంపల్లి ఏసీపీ రహమాన్ తెలిపారు.
అత్యవసర సేవలు మినహా ఎవరూ బయటకు రావద్దు : ఏసీపీ