పెళ్లికి ముందు ఓటేసిన వరుడు - mptc zptc
ఓటు ప్రాముఖ్యతను తెలుపుతూ అందరూ ఓటు వేయాలని సూచిస్తు ఆదర్శంగా నిలిచాడో పెళ్లికొడుకు. ఈ రోజు ఉదయం 10 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి వస్త్రాలతో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశాడు.
ఓటేసిన వరుడు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో రమేష్ అనే పెళ్లి కొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. రమేష్‌కు భీమారం మండలం చెందిన యువతితో ఈరోజు 10 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి వస్త్రాలతో నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అందరూ ఓటు వేయాలని సూచించి... అనంతరం పెళ్లి మండపానికి వెళ్లిన రమేష్‌ను అంతా అభినందించారు.
Last Updated : May 10, 2019, 11:00 AM IST