DRINKING CONTAMINATED WATER: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ ఏరియాలోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో కలుషిత నీరు తాగి 43 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు కావడంతో సింగరేణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురు విద్యార్థినిలు ఉండగా.. 37 మంది విద్యార్థులు ఉన్నారు.
DRINKING CONTAMINATED WATER: కలుషిత నీరు తాగి 43మంది విద్యార్థులకు అస్వస్థత - ఆదిలాబాద్ తాజా వార్తలు
DRINKING CONTAMINATED WATER: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న వార్తలు తరుచూ వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బాసర ఆర్జీయూకేటీలో భోజనంలో కప్పలు, పురుగులు వచ్చాయనే వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. మూడురోజుల క్రితం కస్తూర్భా గాంధీ పాఠశాలలో అల్పాహారం వికటించి 32 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారనే విషయం మరువకముందే.. తాజాగా శ్రీరాంపూర్ డివిజన్లో సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
చికిత్స పొందుతున్న విద్యార్థులు
హాస్టల్ లోని వాటర్ ట్యాంక్‌లో ఉన్న నీరు తాగడంతోనే అందరూ అనారోగ్యానికి గురయ్యారని ఏరియా హెల్త్ ఆఫీసర్ రమేష్ బాబు తెలిపారు. 37 మందిని డిశ్చార్జ్ చేశామని ఆరుగురు విద్యార్థులను రామకృష్ణాపుర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: Missile Attack in Iraq : ఇరాక్‌లో క్షిపణుల దాడి నుంచి తప్పించుకున్న తెలంగాణ కార్మికులు