తెలంగాణ

telangana

'కార్పొరేట్​ సంస్థల లాభార్జన కోసమే ఐపీఓ విధానం'

By

Published : Mar 18, 2021, 3:43 PM IST

ఎల్​​ఐసీని ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో అధికారులు, ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. కార్పొరేట్​ సంస్థల లాభార్జనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. ఐపీఓ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

lic officials, employees protests
మంచిర్యాలలో ఎల్ఐసీ ఉద్యోగుల నిరసనలు

జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న ఐపీఓ విధానాన్ని రద్దు చేసి, వేతన సవరణ వెంటనే అమలు చేయాలని ఆ సంస్థ అధికారులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్​ఐసీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీమా రంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్పొరేట్ సంస్థల లాభార్జన కోసమే ఐపీఓ విధానాన్ని తీసుకువచ్చి ఉద్యోగులకు తీవ్ర నష్టం చేస్తున్నారని ఆరోపించారు. వేతన సవరణలో జాప్యం చేస్తుండటంతో ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోయారు. ఇప్పటికైనా కేంద్రం పునరాలోచించుకొని ఎల్​ఐసీ మనుగడను కాపాడాలని కోరారు.

ఇదీ చదవండి:'పేదలకు కార్పొరేట్‌ తరహాలో వైద్యసేవలు అందించేందుకు సంస్కరణలు'

ABOUT THE AUTHOR

...view details