మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలికలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక ఆఫీసర్ క్లబ్లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. అనంతరం సిబ్బందిని బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి భారతి హోళీ కేరి పరిశీలించారు. ఎన్నికల విధులు కేటాయించిన వారు విధుల్లో చేరకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని మందమర్రి సీఐ మహేశ్ తెలిపారు.
పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది - మున్సిపల్ ఎన్నికలు
మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలికకు సంబంధించి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించారు.
పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది