సీఎం కేసీఆర్ రైతు సమస్యల పరిష్కారం కోసం.. రూపొందించిన ధరణి పోర్టల్‌ను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించగా... మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్‌లో ఎమ్మార్వో మహమ్మద్ జమీర్.. తన కార్యాలయంలో ధరణి పోర్టల్ సేవలను ప్రారంభించారు.
రైతు సమస్యల పరిష్కారానికై ఈ పోర్టల్: ఎమ్మార్వో - Dharani Portal Latest News
మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్‌లో ఎమ్మార్వో మహమ్మద్ జమీర్.. తన కార్యాలయంలో ధరణి పోర్టల్ సేవలను ప్రారంభించారు. రైతు సమస్యల పరిష్కారానికై ఈ పోర్టల్ అని వ్యాఖ్యానించారు.
వెబ్సైట్ ద్వారా నలుగురు రైతులకు క్రయ విక్రయాలకు సంబంధించి పాస్ బుక్కులను సైతం 15 నిమిషాల్లో జారీ చేశారు. వ్యవసాయ భూములను క్రయవిక్రయాలు కోసం మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ధరణిలో రిజిస్ట్రేషన్ సేవలను ఎమ్మార్వో కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని మహమ్మద్ జమీర్ తెలిపారు. ధరణి వెబ్‌సైట్‌పై కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని... రైతులు తమ సమస్యలను నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. ధరణి వెబ్సైట్ ద్వారా క్రయ విక్రయాలు జరిపిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు.