మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఎమ్మెల్యే దివాకర్‌రావు నిర్వహించారు. తెరాస ఆవిర్భావ వేడుకలను ప్రారంభించి మూడో దశలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను బలపరచడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై కార్యకర్తలకు సూచించారు. తెరాస కార్యకర్తలు సైనికులుగా పని చేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. తెరాస అభ్యర్థి విజయం సాధించే దిశగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని కోరారు. పార్టీ సూచించిన అభ్యర్థికి భారీ ఆధిక్యం అందించాలని పేర్కొన్నారు. ఆశావహులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంచిర్యాలలో తెరాస ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశం - HAAJIPUR MANDAL
మంచిర్యాల జిల్లాలో తెరాస ఆవిర్భావ వేడుకలను ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రారంభించారు. అనంతరం మూడో దశలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఆశావహులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు