తెలంగాణ

telangana

ETV Bharat / state

పైప్ లైన్ లీకేజీ.. పొంచి ఉన్న ప్రమాదం - mancherial district updates

మంచిర్యాల జిల్లా సిండ్రోన్ పల్లి గ్రామం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవుతుంది ​. రహదారి కిందిభాగం కొట్టుకుపోయింది.

mission-bhagiratha-pipeline-leakage-at-sindron-palli-village-in-mancherial-district
పైప్ లైన్ లీకేజీ ..పొంచి ఉన్న ప్రమాదం

By

Published : Jul 5, 2020, 3:02 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సిండ్రోన్ పల్లి గ్రామం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ నుంచి నీళ్లు లీకేజ్ అవుతున్నాయి. మూడు మండలాల ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.

నీరు లీకేజీ అయ్యే క్రమంలో నీటి ఉధృతి వల్ల రహదారి కిందిభాగంలో మట్టి కింది భాగం కొట్టుకుపోయింది. దీంతో బీటీ రోడ్డు మాత్రమే వేలాడుతూ కనిపిస్తుంది.

ఏదైనా పెద్ద వాహనం రహదారి మీదుగా వెళ్తే భారీ గొయి పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇదీ చూడండీ :చేపలవేటకు వెళ్లి నలుగురు చిన్నారుల దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details