తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతిఒక్కరూ రెండు మొక్కలైనా నాటాలి..  సంరక్షించాలి: మంత్రి కొప్పుల

మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం ముదిగుంటలో నిర్వహించిన హరితహారం కార్యక్రమాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్​ ప్రారంభించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 20 హెక్టార్​లో ఏర్పాటు చేసిన హరితవనంలో మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు రెండు మొక్కలైనా నాటాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

minster koppula eeshwar started harithahaaram program
ప్రతీ ఒక్కరు రెండు మొక్కలైనా నాటాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్​

By

Published : Jun 25, 2020, 3:58 PM IST

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంటలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అటవీశాఖ ఆధ్వర్యంలో 20 హెక్టార్​లో ఏర్పాటు చేసిన హరితవనంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జిల్లా పరిషత్ ఛైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్​, జిల్లా కలెక్టర్ భారతి హోలికేరీ, రామగుండం సీపీ సత్యనారాయణ హాజరై మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలైన నాటి సంరక్షించాలని మంత్రి సూచించారు.

ఇవీ చూడండి:రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?

ABOUT THE AUTHOR

...view details