తెలంగాణ

telangana

ETV Bharat / state

విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదు: మంత్రి అల్లోల - మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

మంచిర్యాల జిల్లా జడ్పీ కార్యాలయంలో మొదటి సర్వ సభ్య సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు.

సర్వసభ్య సమావేశం

By

Published : Aug 26, 2019, 9:31 PM IST

జడ్పీ కార్యాలయంలో తొలి సర్వ సభ్య సమావేశం

మంచిర్యాల జిల్లాలోని స్థానిక జిల్లా పరిషత్​ కార్యాలయంలో మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో 42 శాఖల అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య నెలకొందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన సమయానికి వైద్యులు, నర్సులు రావడం లేదని జడ్పీటీసీ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి జిల్లా వైద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు మరోసారి పునరావృతం కాకూడదని అధికారులను హెచ్చరించారు. అలాగే డెప్యుటేషన్​లో విధులు నిర్వహిస్తున్న వారిని పాత స్థానాలకు పంపించాలని కలెక్టర్​కు మంత్రి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details