తెలంగాణ

telangana

ETV Bharat / state

harish rao in bellampalli: గర్భిణీలకు త్వరలోనే పోషకాహార కిట్లు: హరీశ్​రావు

harish rao in bellampalli: రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రూ.94 లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ భవనాన్ని ఆయన ప్రారంభించారు.

harish rao
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు

By

Published : Mar 4, 2022, 10:12 PM IST

harish rao in bellampalli: రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేయడం వల్లనే 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రూ.94 లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ భవనాన్ని ప్రారంభించారు.

త్వరలోనే గర్భిణీలకు పోషకాహార కిట్లు

అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణాన్ని మంత్రి పరిశీలించారు. త్వరలోనే గర్భిణీల కోసం పోషకాహార కిట్లను అందజేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని హరీశ్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిపై కుట్రలు చేస్తోందని ఆరోపించారు. భాజపా, కాంగ్రెస్ నాయకుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమావేశంలో అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ విఠల్, జిల్లా కలెక్టర్​ భారతి హోళికేరి, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మున్సిపల్ ఛైర్మన్ పాల్గొన్నారు.

రాబోయే రోజుల్లో గర్భిణీలకు పోషకాహార కిట్లు అందించేందుకు కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. నీళ్లు, కరెంట్ తెచ్చుకున్నాం. మహిళల కోసం కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు ఇస్తున్నాం. పక్కన ఉన్న మహారాష్ట్రకు పోతే 8 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారంట. అవి కూడా పేలిపోతున్నాయంట. ఇక్కడేమో మన రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ వస్తుంటే మన కనెక్షన్లు తీసుకుని వాళ్ల పొలాలకు నీళ్లు పారిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు మూడే మెడికల్ కాలేజీలు. ఇప్పుడు మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు. ఇప్పడు కేంద్రం మన సింగరేణిని కూడా అమ్మేందుకు యత్నిస్తోంది.

- హరీశ్ రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

ఈ నెలలోనే వడ్డీలేని రుణాలిస్తాం

డ్వాక్రా గ్రూప్ సభ్యులకు ఈ నెలలోనే వడ్డీ లేని రుణాలు విడుదల చేసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో రూ.15 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్​, ఎంపీ వెంకటేష్​ నేతతో కలిసి శంకుస్థాపన చేశారు. మహిళా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మెప్మా ఉద్యోగులు, రిసోర్స్ పర్సన్స్​కు 30 శాతం వేతనాలు పెంచుతున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కేంద్రం భేటి బచావో.. భేటి పడావో కోసం రూ.800 కోట్లు కేటాయిస్తే అందులో రూ.600 కోట్లు ప్రచారానికే ఖర్చు చేసిందని విమర్శించారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోబోమని హరీశ్ రావు హెచ్చరించారు. అంతకుముందు తెరాస శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి హరీశ్ రావుకు ఘన స్వాగతం పలికారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details