తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగ నియామకాల్లో వివక్ష సరికాదు: భాజపా - తెలంగాణ తాజా వార్తాలు

తెరాస ప్రభుత్వం ఇప్పటివరకు పోలీసు నియామకాలు తప్ప, మరేవీ చేపట్టలేదని మంచిర్యాల జిల్లా భాజపా అధ్యక్షుడు రఘునాథ్ రావు అన్నారు. కరోనా కారణంగా ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి దుర్భరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యపై జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు.

Breaking News

By

Published : Dec 29, 2020, 7:10 PM IST

కరోనా విపత్కర సమయంలో ప్రైవేట్ పాఠశాలలు మూతపడడంతో, ఉపాధ్యాయుల పరిస్థితి దుర్భరంగా తయారైందని.. వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంచిర్యాల జిల్లా భాజపా అధ్యక్షుడు రఘునాథ్ రావు అన్నారు. నిరుద్యోగ సమస్యపై జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

తెరాస ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నిరసనలు చేయకుండా అణచివేసేందుకు కేవలం పోలీస్ నియామకాలను చేస్తున్నారని ఆరోపించారు. రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ఇది చూడండి:పైప్​లైన్​ పగిలిపోయింది.. నీరు ఎగజిమ్మింది

ABOUT THE AUTHOR

...view details