మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలు... జన సంచార ప్రాంతాల్లో నిలిపిన వాహనాల ఫొటోలు తీసి యజమానులకు ఈ- చలానాలు పంపుతున్నారు. మార్కెట్‌రోడ్డు, బస్టాండు, బెల్లంపల్లి చౌరస్తా, వెంకటేశ్వర థియేటర్, ముఖరాం చౌరస్తా, శ్రీనివాస థియేటర్‌రోడ్ ప్రాంతాల్లో అపసవ్యదిశలో వస్తున్న వాహన చోదకులను ఆపి వారికి చలానా చేతికిచ్చి సరైన మార్గంలో పంపుతున్నారు. హోటళ్లు, బార్లు, షాపింగ్‌మాల్స్, రెస్టారెంట్ల వద్ద నో- పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనాలపైనా జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇంతగా చర్యలు తీసుకుంటన్నా సరే కొందరు వాహన చోదకులు మాత్రం చలానాలేగా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.
ట్రాఫిక్ కూడళ్ల వద్ద
ప్రమాదాల సమయంలో శిరస్త్రాణం వల్ల కలిగే ప్రయోజనాలపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పరిస్థితి కొంతమెరుగైనా ధరించేవారి సంఖ్య ఆశించినంత పెరగలేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ-చలానాల జోరు పెంచారు. ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొంతమంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి కెమెరాలతో ఫొటోలు తీయించి ఈ-చలానాలు పంపిస్తున్నారు.