బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మహాత్మ జ్యోతిబా ఫూలే ఎంతో కృషి చేశారని మంచిర్యాల కలెక్టర్ భారతి హోళీ కేరి కొనియాడారు. కలెక్టరేట్లో.. పూలే 194వ జయంతి వేడుకలను ఆమె ఘనంగా జరిపారు. దేశానికి ఫూలే అందించిన సేవలను స్మరించుకున్నారు.
మహాత్మా జ్యోతిబా ఫూలేకు కలెక్టర్ ఘన నివాళి - మంచిర్యాల కలెక్టరేట్
మంచిర్యాల కలెక్టరేట్లో 194వ మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ భారతి హోళీ కేరి.. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఫూలే అందించిన సేవలను ఆమె స్మరించుకున్నారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే
సమాజంలో మంచి కోసం సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తుల్లో పూలే ఒకరని కలెక్టర్ వివరించారు. యువత వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సూచించారు.
ఇదీ చదవండి:సాగర్లో ప్రత్యేక వ్యూహం... సామాజికవర్గాల వారిగా పార్టీల ప్రచారం