మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటలో యువ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం సల్గుపల్లికి చెందిన జీవన్, కాసిపేటకు చెందిన గౌరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. డ్రైవర్గా పనిచేస్తున్న జీవన్.. పనిమీద బయటకు వెళ్తున్నానని చెప్పి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.
పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం - lovers sucide attempt in manchirial
పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన.. మంచిర్యాల జిల్లా కాసిపేటలో చోటుచేసుకుంది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.
పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
అప్పటికే గౌరుకు పెళ్లి సంబంధం చూసేందుకు ఆమె తల్లిదండ్రులు భీమిని మండలం టేకులపల్లికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు గమనించి బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నందున మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చూడండి: కొత్త టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు