మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని రైల్వే క్వార్టర్స్‌లో ఈ నెల 27న మూడు చోరీలు చేసిన అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం రూ. 71 వేల 500 విలువగల బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని బెల్లంపల్లి ఏసీపీ రహమాన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన యాట నరసింహ, మచిలీపట్నం వందపాలెం గ్రామానికి చెందిన తోట కృష్ణమోహన్ దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు.
అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు.. ఏపీలోనూ 45కుపైగా కేసులు - మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వార్తలు
బెల్లంపల్లిలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకరిపై 45, మరోకరిపై 10 కేసులు ఉన్నట్లు ఏసీపీ రహమాన్ తెలిపారు. నిందితుల నుంచి రూ. 71 వేల 500 విలువగల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు.. ఏపీలోనూ 45కుపైగా కేసులు
ఫిబ్రవరి 26న వీరిద్దరూ కాగజ్ నగర్లో కూడా దొంగతనం చేసినట్లు పోలీసులు వివరించారు. కృష్ణమోహన్‌పై ఏపీలోని 21 పోలీస్ స్టేషన్లలో 45 కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు. నరసింహపై 10 కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు రహమాన్ వెల్లడించారు.