తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం.. రోడ్లన్నీ గుంతలమయం - భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో రోడ్లు భారీగా దెబ్బదిన్నాయి.

భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం.. రోడ్లన్నీ వరదమయం
భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం.. రోడ్లన్నీ వరదమయం

By

Published : Sep 19, 2020, 6:55 AM IST

మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఫలితంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. సుమారు రెండు గంటల పాటు కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షానికి రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు.

వరదనీటిలో పలు కాలనీలు..

మంచిర్యాల పట్టణం పరిధిలోని ఏసీసీ ప్రాంతంలోని డ్రైనేజీలో గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందాడు. భారీ వర్షాలకు జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు.

ABOUT THE AUTHOR

...view details