మర్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాలీఫర్ శిబిరాన్ని మంచిర్యాల ఏసీపీ గౌస్ బాబా, మార్వాడి సంఘం అధ్యక్షులు పవన్ తివారి ప్రారంభించారు. మూడు రోజుల పాటు శిబిరం కొనసాగుతుందని తివారీ తెలిపారు. ప్రమాదవశాత్తు కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి ఉచితంగా కృత్రిమ అవయవాలను అమర్చుతామన్నారు.
'దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అమర్చుతాం' - handicaped
మంచిర్యాల జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు కాలీఫర్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు తరలివచ్చారు.
కాలీఫర్ శిబిరం
గత నాలుగేళ్లలో 800 మంది దివ్యాంగులకు పైగా జైపూర్ కృత్రిమ కాళ్లను అమర్చినట్లు తెలిపారు. ఈ శిబిరంలో 350 మందికి 200 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. వీరందరికీ ఉచితంగా కృత్రిమ కాళ్లను పంపిణీ చేస్తామన్నారు. శిబిరానికి దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు తరలివచ్చారు. ఇవీ చూడండి: సాధ్వి ప్రజ్ఞ సింగ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం