కేసీఆర్ ఉన్నంత వరకూ రాష్ట్రంలో భాజపా ఆటలు సాగవన్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. ప్రభుత్వం చేపడుతోన్న పలు అభివృద్ధి పనులకు.. కాషాయ పార్టీ అడ్డు పడుతోందని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
కేసీఆర్ ఉన్నంత వరకూ భాజపా ఆటలు సాగవు: బాల్క సుమన్ - బెల్లంపల్లి పట్టణం
పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నమోదును ఓ పండగలా జరపాలని కార్యకర్తలను కోరారు.
'కేసీఆర్ ఉన్నంతవరకూ భాజపా ఆటలు సాగవు'
ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ సతీశ్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ భాగ్యలక్ష్మి, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:విపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: వినయ్ భాస్కర్