ముద్దులొలికే గోపికమ్మలు, కృష్ణయ్యలు - gopika_krishna_at_celebrations
కృష్ణాష్టమి సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సందడి నెలకొంది. చిన్నారులను తల్లిదండ్రులు గోపిక, కృష్ణ వేషధారణలతో అలంకరించారు.
ముద్దులొలికే గోపికమ్మలు, కృష్ణయ్యలు
కృష్ణాష్టమి వేడుకలను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వైభవంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుల, గోపికల వేషధారణలతో అలరించారు. చిరునవ్వులు చిందిస్తూ చిన్నారులు ఉట్టి కొట్టారు. హుషారుగా నృత్యాలు చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో కృష్ణాష్టమి సంబురాలు ఘనంగా నిర్వహించారు.