తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాలలో ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు - తెరాస ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆయన కొనియాడారు.

Mla divakar
Mla divakar

By

Published : Apr 27, 2021, 2:18 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక శాసనసభ్యుడు దివాకర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హమాలివాడలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు 20 ఏళ్ల క్రితం తమ నాయకుడు కేసీఆర్ ఒకే ఒక్కడుగా పార్టీని స్థాపించారని పేర్కొన్నారు.

ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై అందరిని ఆలోచించేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. ఉద్యమంలో రాష్ట్ర ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి దిల్లీలో పీఠాన్ని కదిలించారని కొనియాడారు. రాష్ట్రాన్ని సాధించిన ఘనత తెరాస పార్టీకి దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కృషిని ఎప్పటికీ మరిచిపోరన్నారు.

ABOUT THE AUTHOR

...view details