మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను మంచిర్యాల కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, శాసనమండలి సభ్యులు పురాణం సతీష్, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పీవీ నరసింహారావు అపర చాణక్యుడు: కలెక్టర్ - పీవీ శతజయంతి ఉత్సవాలు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలు నిరాడంబరంగా సాగాయి. పేద ప్రజలకు భూ పంపిణీ చేసి ఆదుకున్న మహోన్నతమైన వ్యక్తి అని పీవీని కలెక్టర్ భారతి హోళీకేరి కొనియాడారు.
నిరాడంబరంగా పీవీ శతజయంతి ఉత్సవాలు
పేద ప్రజలకు భూ పంపిణీ చేసి ఆదుకున్న మహోన్నతమైన వ్యక్తి పీవీ అని కలెక్టర్ కొనియాడారు. ఆయన ఓ గొప్ప దార్శనికుడని, సంస్కరణలకు ఆద్యుడని పేర్కొన్నారు.