తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎండవేడికి పెట్రల్​ సీసా నుంచి మంటలు - ఎండలు

మంచిర్యాల జిల్లాలో ఓ దుకాణంలో ఎండల వేడిమికి  నిల్వచేసిన పెట్రోల్​ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లో దుకాణం మొత్తం అంటుకుంది.

ఎండవేడికి పెట్రల్​ సీసా నుంచి మంటలు

By

Published : May 26, 2019, 8:01 PM IST

ఎండవేడికి పెట్రల్​ సీసా నుంచి మంటలు

మంచిర్యాల జిల్లా మందమర్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఎండవేడికి రెండవ జూన్​ మసీద్​ పక్కనున్న తినుబండారాల దుకాణంలో నిల్వచేసిన పెట్రోల్​ సీసాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో దుకాణం మొత్తం అంటుకుంది. ఆ సమయంలో దుకాణంలో ఉన్న ఇద్దరు చిన్నారులు బయటకు పరుగులు తీసి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మసీద్​లో ప్రార్థనలు చేస్తున్నవారంతా బయటకు వచ్చి మంటలను అదుపు చేశారు. వారం రోజుల క్రితం ఇలాగే మరో దుకాణంలో ఎండవేడికి మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details