మంచిర్యాల జిల్లా మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని కర్నూలుకు చెందిన శివయ్య, హైదరాబాద్కు చెందిన లక్ష్మయ్య, శివ కలిసి 16 క్వింటాళ్ల పత్తి విత్తనాలను వాహనంలో తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై శివ కుమార్ తెలిపారు.
30 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత - mancherial district
మందమర్రిలో రూ. 30 లక్షల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించామని ఎస్సై శివ కుమార్ పేర్కొన్నారు.
30 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
పత్తి విత్తనాల విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని అని ఎస్సై చెప్పారు. విత్తనాల తరలింపులో మరో ముగ్గురు పాత్ర ఉందని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో 16కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు