మాజీ ఎమ్మెల్యే సతీమణికి జడ్పీటీసీగా బీ ఫామ్ - ex mla
మంచిర్యాల జిల్లా కోటపల్లిలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సతీమణికి జడ్పీటీసీ అభ్యర్థిగా తెరాస పార్టీ బీఫామ్ అందించింది. గెలిచిన అనంతరం కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేస్తామని బీఫామ్ అందించిస చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్ తెలిపారు.
జడ్పీటీసీ అభ్యర్థిగా తెరాస పార్టీ బిఫామ్
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం తెరాస జడ్పీటీసీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సతీమణి భాగ్యలక్ష్మికి చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్ బీ ఫామ్‌ను అందజేశారు. జిల్లాలో 16 జడ్పీటీసీ స్థానాలను గెలుస్తామని సుమన్ ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన అనంతరం కలిసికట్టుగా పనిచేస్తూ కేంద్ర, రాష్ట్రాల నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేస్తూ కార్యకర్తలు సందడి చేశారు.