విద్యావంతులకు ఉపాధి 'హామీ' గ్రామీణ ప్రాంత నిరుద్యోగ విద్యావంతులకు ఉపాధిహామీ బాసటగా నిలుస్తోంది. వేసవి రీత్యా ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఒళ్లొంచి శ్రమించి నాలుగు రూపాయలు సంపాదించికుంటున్నారు నేటి యువత. ఉన్నత చదువులు చదివినా మొహమాటం లేకుండా ఉపాధి పథకంలో కాయకష్టం చేస్తున్నారు. కనీస అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా ఉపాధి పనులకు వెళ్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి యువత.
ఉపాధితో చదువుకు అండ
ఉదయాన్నే ఉపాధి పనిచేసుకుంటూ మధ్యాహ్నం నుంచి వేరే పని చూసుకుంటున్నారు. ఉపాధి హామీద్వారా వచ్చిన మొత్తంతో పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నారు.
విద్యావంతుల ఉత్సాహం చూసి స్థానిక ఉపాధి సిబ్బంది కూడా వారిని ప్రోత్సహిస్తున్నారు. సమయానికి నగదు అందేలా చూస్తున్నారు. తిరిగి కళాశాలలు తెరిచే సరికి అవసరమైన నగదును కూడగట్టుకుంటున్నారు. విలువైన కాలాన్ని వృథా చేయకుండా తమ కష్టంతోనే తమకు కావల్సిన నగదు సంపాదించుకుంటున్న ఈ విద్యా వంతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇదీ చదవండి: బాపురావే... ఆదిలా'బాద్'షా....