తెలంగాణ

telangana

ETV Bharat / state

అంగన్​వాడీలో సబ్ కలెక్టర్ కుమార్తె - rahul raj

ప్రభుత్వ అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేర్పిస్తే ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అదే పని చేశారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్. తన కుమార్తెను అంగన్​వాడీ కేంద్రంలో చేర్పించి అందరికి ఆదర్శంగా నిలిచారు.

రితిక రాజ్

By

Published : Jun 28, 2019, 5:26 PM IST

అంగన్​వాడీలో సబ్ కలెక్టర్ కుమార్తె

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్​ రాహుల్ రాజ్ తన 14 నెలల కుమార్తె రితిక రాజ్​ను పట్టణంలోని కాంట్రాక్టర్ బస్తీ అంగన్​వాడీ కేంద్రంలో చేర్పించారు. ఈ నెల 19 నుంచి రాహుల్ రాజ్ తల్లి జ్యోతిక క్రమం తప్పకుండా రితకను అంగన్​వాడీకి తీసుకొస్తున్నారు. రితిక కూడా తోటి పిల్లలతో సరదాగా ఆటలు ఆడుతోంది. సబ్ కలెక్టర్ తన బిడ్డను అంగన్​వాడీ కేంద్రానికి పంపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

ABOUT THE AUTHOR

...view details