మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని సింగరేణి ప్రాంతంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తితో భూగర్భ గనులు, కొలతల గనుల్లో పనిచేసే కార్మికులు విధులకు రావాలంటేనే భయపడుతున్నారు.
సింగరేణిలో విజృంభిస్తున్న కరోనా... కొత్తగా 56 మందికి పాజిటివ్ - మంచిర్యాల జిల్లా కరోనా వార్తలు
మందమర్రి ఏరియాలోని సింగరేణి ప్రాంతంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం 190 మంది కార్మికులకు పరీక్షలు నిర్వహించగా 56 మందికి పాజిటివ్ వచ్చింది.
సింగరేణిలో విజృంభిస్తున్న కరోనా... కొత్తగా 56 మందికి పాజిటివ్
బుధవారం రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రిలో 190 మంది కార్మికులకు కొవిడ్ పరీక్షలు చేయగా... 56 మందికి పాజిటివ్ తేలింది. మంగళవారం 126 మందికి పరీక్షలు చేయగా... 26 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. మందమర్రిలో కరోనా బారినపడిన సింగరేణి కార్మికుడు చికిత్స పొందుతూ హైదరాబాద్లో మృతి చెందాడు.