మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసాన్ని కాంగ్రెస్ మహిళా శ్రేణులు ముట్టడించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖపై దివాకర్ రావు తనయుడు విజిత్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించారు.
ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు.. ఏం జరిగిదంటే? - ఆదిలాబాద్ తాజా వార్తలు
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖపై ఎమ్మెల్యే దివాకర్ రావు తనయుడు విజిత్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. తమ నాయకురాలికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ మహిళా కార్యకర్తల ఆధ్వర్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే ఇంటి ముట్టడి
నివాసంలో ఆయన కుటుంబసభ్యులు లేకపోవడంతో బహిరంగంగా తమ అధ్యక్షురాలికి క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. ఏసీపీ సాధన రష్మీ పెరుమాల్ వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ క్షమాపణ చెప్పేంతవరకు కదిలేదిలేదని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: రామకృష్ణాపురం కేరాఫ్ కూరగాయలు: టైమ్‌పాస్ కోసం చేస్తే ఆరోగ్యం.. ఆదాయం..