CM KCR Speech in BRS Public Meeting at Mancherial :కాంగ్రెస్ హయాంలో రిజిస్ట్రేషన్లు కావాలంటే లంచాలు ఇవ్వాల్సిందేనని.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిధరణి పోర్టల్(Dharani Portal) తేవడం వల్ల అర్ధగంటలోపు రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. కానీ అలాంటి ధరణిని కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తే తీసి బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని మండిపడ్డారు. ఈ పోర్టల్‌ను తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు.
ప్రజల కట్టే పన్నులు రైతుబంధు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ అంటుందని.. రైతుబంధు దుబారానా అంటూ సభికులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రైతుబంధు రూ.16వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. మరోవైపు రైతులకు 3 గంటలు కరెంటు చాలని రేవంత్‌రెడ్డి అంటున్నారు.. ఆ కరెంటు సరిపోతుందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
BRS Praja Ashirvada Sabha at Mancherial :కాంగ్రెస్ హయాంలో రిజిస్ట్రేషన్లు కావాలంటే లంచాలు.. కానీ ప్రస్తుతం రైతు బొటనవేలు పెట్టగానే భూయాజమాన్య హక్కులు మారుతున్నాయని కేసీఆర్ హర్షించారు. కేంద్రం వద్ద అప్పులు తెచ్చి సింగరేణి(Singareni Collieries Company)లో కేంద్రానికి వాటా ఇచ్చారని ధ్వజమెత్తారు. కానీ ఇప్పుడు సింగరేణి కార్మికులు ఇళ్లు కట్టుకుంటే రూ.10 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకు - కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఉండదు : కేసీఆర్