చైనా-భారత్ సరిహద్దులో చైనా సైనికుల దాడుల్లో అమరుడైన జవాన్ సంతోష్‌బాబు ఆత్మకు శాంతి కలగాలని భాజపా నాయకులు నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చైనా దేశం చేసే దుశ్చర్యలకు భారత సైనికులు బలయ్యారన్నారు.
చైనాపై సర్వత్రా ఆగ్రహం.. జిన్‌పింగ్ దిష్టిబొమ్మ దగ్ధం - india-china conflict
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద భాజపా నాయకులు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అమరుడైన భారత జవాన్ సంతోష్‌బాబు ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ దిష్టిబొమ్మ దగ్ధం
కరోనా మహమ్మారిని ప్రపంచ దేశాలకు కట్టబెట్టారని ఆరోపించారు. వీరికి సరైన బుద్ధి చెప్పాలంటే చైనా తయారుచేసిన వస్తువుల కొనుగోళ్లను నిలిపివేసి ఆర్థికంగా వెనుకబడేయాలని భాజపా జిల్లా బాధ్యుడు రఘునాథరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: చైనా బరి తెగింపు- గాల్వన్ లోయ తమదేనని ప్రకటన