లోక కల్యాణార్థం.. మంచిర్యాల జిల్లా మందమర్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చండీయాగం ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా స్వామి వారికి.. శాంతి, సుదర్శన హోమం, వంటి ప్రత్యేక పూజలను భక్తిశ్రద్ధలతో జరిపారు.
మందమర్రి శ్రీ వెంకటేశ్వరాలయంలో ఘనంగా చండీయాగం - మందమర్రి శ్రీ వెంకటేశ్వరాలయం
మంచిర్యాల జిల్లా మందమర్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో.. చండీయాగం వైభవంగా జరిపారు. 3 రోజుల పాటు హోమ గుండాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలను చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
మందమర్రి శ్రీ వెంకటేశ్వర ఆలయం
అర్చకుల మంత్రోచ్ఛారణలతో.. ఆలయ ప్రాంగణమంతా మారుమోగిపోయింది. వేడుకలను చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హోమంలో.. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, కరీంనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు పూజారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సూర్యాపేటలో షర్మిలకు ఘనస్వాగతం