మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ సిమెంట్ పరిశ్రమ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. 14 నెలలుగా కర్మాగారాన్ని సరైన నిర్వహణ చేయకుండా.. వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంట్ కంపెనీ నష్టాల్లో ఉందంటూ.. అకారణంగా కార్మికులను తొలగిస్తున్నారని తెలంగాణ సిమెంట్ కార్మిక సంఘం నాయకుడు ముఖేశ్ గౌడ్ ఆరోపించారు.
సిమెంట్ పరిశ్రమ ముందు కార్మికుల ఆందోళన - మంచిర్యాల జిల్లా వార్తలు
జీతం ఇవ్వడం లేదంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ సిమెంట్ పరిశ్రమలో కార్మికులు ఆందోళన చేపట్టారు. 14 నెలలుగా పరిశ్రమ నిర్వహణ చేయకుండా వేతనాలు ఇవ్వడం లేదని కార్మిక సంఘం నాయకులు ఆరోపించారు.
సిమెంట్ పరిశ్రమ ముందు కార్మికుల ఆందోళన